రాబోయే రోజుల్లో వరంగల్‌ లో వ్యవసాయ పరిశోధన కేంద్రాలు

Sun,September 9, 2018 05:41 PM

we will developed agriculture sector says ICAR Director

వరంగల్ : వరంగల్ జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఐసీఏఆర్ డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీ మహాపాత్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ బోటనీ డిపార్ట్‌మెంట్‌ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మహాపాత్ ఎంపీ సీతారాం నాయక్ తో కలిసి పైలాన్‌ ను ఆవిష్కరించారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో మహాపాత్ మాట్లాడుతూ..కాకతీయ యూనివర్సిటీకి రావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ లో వ్యవసాయ పరిశోధన కేంద్రాలను నెలకొల్పుతామని తెలిపారు. బోటనీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సంవత్సరాంతం నిర్వహిస్తామని ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ లో చదువుకొని ఎంపీ గా ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

88
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles