సీబీఐటీలో పాత ఫీజులనే కొనసాగిస్తాం

Sun,December 10, 2017 06:15 AM

We will continue old fees in CBIT says principal

హైదరాబాద్: చైతన్యభారతీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాల(సీబీఐటీ)లో ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ గత నాలుగు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై యాజమాన్యం దిగివచ్చింది. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్ డా.పి.రవీందర్‌రెడ్డి మాట్లాడారు. న్యాయస్థానం అనుమతితోనే ఫీజులను పెంచామని, తాము బలవంతంగా వసూలు చేయడంలేదన్నారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళన దృష్ట్యా శుక్రవారం యాజమాన్య కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థుల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేశామన్నారు. ప్రస్తుతానికి పాత ఫీజు రూ.లక్షా 13,500 మాత్రమే చెల్లించాలన్నారు. అదనపు ఫీజులను చెల్లించనవసరం లేదన్నారు. న్యాయస్థానం అనుమతులపై ప్రభుత్వం స్పందించిన నేపథ్యంలో ఆ వివాదం ఉన్నత న్యాయస్థాన పరిధిలో కొనసాగుతున్న క్రమంలో అక్కడ వచ్చే తీర్పు ఆధారంగానే ఫీజుల నిర్ణయాలను కొనసాగించాలని కమిటీ నిర్ణయానికి వచ్చిందన్నారు. విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజు చెల్లించి పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ప్రిన్సిపాల్ కోరారు. సోమవారం నుంచి కళాశాల యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

2071
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles