రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు కలిపిస్తాం

Tue,November 19, 2019 09:34 PM

జహీరాబాద్ : రైల్వే స్టేషన్‌లో సౌకర్యలు కలిపించి, ప్రయాణికులకు అనుగుణంగా రైలు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానంద్ మాల్యా తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించి, స్టేషన్‌లో చేస్తున్న పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్‌లో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు కలసి పలు సమస్యలు తెలిపారు. జహీరాబాద్ స్టేషన్‌లో నిర్మాణం చేస్తున్న రెండో ప్లాటు ఫాం, పుట్ ఓవర్ బ్రిడ్జి, షాపింగ్ మాల్, పార్కుల నిర్మాణం పనులు పరిశీలించారు. పార్కులో మొక్కలు నాటిన్నారు. జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా నిర్మాణం చేసి ప్రయాణికులకు సౌకర్యలు కలిపిస్తామన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పలు సమస్యలు రైల్వే జీఎం దృష్టికి తీసుకపోయారు. స్టేషన్‌లో ప్రయాణికులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మాణం చేయాలన్నారు.


రైల్వే ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు నిర్మాణం చేయాలన్నారు. పుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద లిప్టు నిర్మాణం చేయాలని కోరారు. ప్రయాణికులు నిలిచి ఉండేందుకు షెడ్‌లు నిర్మాణం చేయాలన్నారు. జహీరాబాద్ నుంచి వెళ్లి రైలులను కోహీర్ స్టేషన్‌లో నిలిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారి వెంట పటాన్‌చెరువు, సంగారెడ్డి-జహీరాబాద్ వరకు కొత్తగా రైల్వే లైన్ నిర్మాణం చేసేందుకు కృషి చేయాలని ఎంపీ బీబీ పాటిల్ తరపున రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీదు రైల్వే జీఎంకు వినతి పత్రం ఇచ్చారు. జహీరాబాద్, కోహీర్ రైల్వే స్టేషన్‌లో కొత్తగా క్వార్టర్స్ నిర్మాణం చేయాలని కోరారు. కొత్తగా రైల్వే భవనాలు నిర్మాణం చేయాలన్నారు. బీదర్ ఇంటర్ సిటి రైలు సమయంలో మార్పులు చేయాలన్నారు. వికారాబాద్, మార్పల్లి, జహీరాబాద్, బీదర్, పార్లి వైజానాథ్ వరకు ప్యాసింజర్ రైలు నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్, రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీదుతో పాటు వ్యాపారులు, ప్రయాణికులు పాల్గొని సమస్యలు వివరించారు.

508
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles