పేదలను ఆదుకునేందుకు కృషి: ఎమ్మెల్యే దయాకర్‌రావు

Tue,April 3, 2018 05:37 PM

we are trying to help the poor says mla errabelli dayakar rao

జనగామ: పేద కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. పేదలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు.. అందుకు ప్రతి కార్యకర్త సహకరించాలని కోరారు. ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టి ఇప్పటికే పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధులను సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మంజూరు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు.

1947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles