ఎనిమిది తడులు.. 40 టీఎంసీలు

Sun,December 3, 2017 06:20 AM

Water release from Nagarjunasagar left canal on 10th

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద సాగునీటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. సాగర్‌లోని నీటి లభ్యత ఆధారంగా జోన్-1, 2 పరిధుల్లోని 4.50 లక్షల ఎకరాల్లో యాసంగిపంటకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించిన నీటిపారుదలశాఖ ఆ మేరకు నీటి విడుదల కోసం కృష్ణానదీ యాజమాన్యబోర్డుకు ఇండెంట్ కూడా సమర్పించింది. ఒకవైపు నీటి ఆదాతో పాటు నిర్దేశించిన ఆయకట్టులో చివరి ఎకరా వరకు సాగునీరు అందించేందుకుగాను నాగార్జునసాగర్ చీఫ్ ఇంజినీర్ ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా సాగర్ ఎడమకాల్వ కింద సాగునీటి విడుదలపై నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి ఆదేశాల మేరకు మిర్యాలగూడలో రైతుల అవగాహన, సలహాల కోసం సమావేశం జరిగింది. విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇతర ప్రజాప్రతినిధులు, ఎన్‌ఎస్పీ ఇంజినీర్లు రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. రైతుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. వీటన్నింటిని క్రోడీకరించి మిర్యాలగూడ, టేకులపల్లి సర్కిళ్ల పరిధిలో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఎనిమిది తడుల్లో సాగునీరు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఈ ఎస్ సునీల్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి సాగునీటి విడుదల మొదలవుతుందని, వచ్చే ఏడాది మార్చి 28 వరకు ఎనిమిది తడుల్లో దాదాపు 40 ( 39.99) టీఎంసీలను విడుదల చేస్తామన్నారు. ఏయే సమయాల్లో ఎంత నీటిని విడుదల చేస్తామనే దానిపై క్షేత్రస్థాయిలో రైతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు.

1299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles