‘మన నీళ్లు మనకే’ నినాదంతో ముందుకు..

Thu,March 21, 2019 08:48 AM

water management at shamshabad airport

శంషాబాద్ : భూమ్మీద నివసించే ప్రాణికోటికి జలమే జీవనాధారం...ప్రాణాధారం. నీళ్లు లేకుండా ఏ ప్రాణి బతుకదు. అంత ప్రాధాన్యత ఉన్న నీటిని వృథా చేస్తే కన్నీళ్లే. భూగర్భ జలాలను కాపాడుకుంటేనే మన మనుగడ. ప్రకృతి మనకందించిన అమూల్య సంపద జలం. తలాపునే నీళ్లున్నా గొంతు తడువని స్థితిలో కొన్ని ప్రాంతాలున్నాయి. జలసంపదను భావితరాలకు పదిలంగా అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. వృథా నీటిని భూమిలోకి ఇంకించాలి. శంషాబాద్ నీటి సంరక్షణ, పర్యావరణ సుస్థిరతలో శంషాబాద్ మానవాళికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆధునిక ప్రత్యేక పద్ధతులతో నీటి నిల్వల పెంపు, నీటి పొదుపు, వృథా నీటిని సద్వినియోగం చేస్తున్నారు. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన నాటి నుంచి విమానాశ్రయం నిర్వహణలో పర్యావరణ సుస్థిరత అనేది ప్రధాన అంశంగా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ జాతీయ, అంతర్జాతీయ సంస్థల గుర్తింపుతో ఎన్నో అవార్డులు సాధిస్తుంది. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నీటి వ్యవస్థపై ప్రత్యేక కథనం..

ఎయిర్‌పోర్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, దాని రోజువారి నిర్వహణలో అది అడుగడుగున గోచరిస్తున్నది. ఇటీవలే ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ)హైదరాబాద్ ఎయిర్‌పోర్టు తీసుకుంటున్న జలసంరక్షణ చర్యలను గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ సిల్వర్ రికగ్నైషన్ 2019 పురస్కారంతో గుర్తించింది. హైదారాబాద్ ఎయిర్‌పోర్టు టర్మినల్ బిల్డింగ్‌కు విద్యుత్‌ను ఆదా చేయడానికి, ఎయిర్‌పోర్టును సహజమైన వెలుతురు ప్రసరించే విధంగా రూపొందించారు. నీటి వినియోగాన్ని తగ్గించడానికి ఎయిర్‌పోర్టు భవనాల్లోని నీటిని రీసైకిలింగ్ చేస్తున్నారు. ఈ చర్యలతో ఎయిర్‌పోర్టు 2008లో యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి లీడర్‌షిప్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్ (ఎల్‌ఈఈడీ)లో సిల్వర్ రేటింగ్ పొందింది.

ఎయిర్‌పోర్టులో నీటి సంరక్షణకు ఆటోమేటెడ్ విధానం


నీటి సంరక్షణలో భాగంగా ఇటీవల ఎయిర్‌పోర్టులోని నీటిపారుదల వ్యవస్థను సెమీ ఆటోమేటెడ్ నుంచి పూర్తిస్థాయి ఆటోమేటెడ్‌కు మార్చారు. దాని ద్వారా 8.4కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌పోర్టు అప్రోచ్ రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లకు అందించే నీటి వినియోగాన్ని నియంత్రిస్తున్నారు. ఈ ఆటోమేటెడ్ విధానంలో 19కిలోమీటర్ల మెయిన్ పైప్‌లైన్‌ను, 35కిలోమీటర్ల పొడవైన సబ్ మెయిన్ పైప్‌లైన్‌ను ఉపయోగించుకుంటున్నారు. సీజన్స్‌కు అనుగుణంగా మొక్కలకు నీళ్లు అందించడానికి మొత్తం 240కిలోమీటర్ల డ్రిప్ ట్యూబ్‌లు, 4,300 స్ప్రింకర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ నీటి వ్యవస్థను క్లౌడ్ బేస్డ్ రియల్ టైమ్ మానిటరింగ్‌తో అనుసంధానించడం వల్ల నీటి వినియోగం గణనీయంగా తగ్గించారు. ఈ ఆటోమేటిక్ నీటిపారుదల వ్యవస్థ వల్ల ఎయిర్‌పోర్టు పరిధిలోని నీటిపారుదలను మొబైల్ యాప్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. ఈ మొత్తం వ్యవస్థ ద్వారా నీటి వినియోగంలో 20శాతం ఆదా అవుతుంది. ఈ విధానం వ్యవస్థలో ప్రతిపంపింగ్ స్టేషన్ వద్ద సాటిలైట్ ఇరిగేషన్ కంట్రోలర్లు ఉంటాయి. ఇంటర్నెట్ ద్వారా సెంట్రల్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌తో చేయబడి నీటి అవసరాలకు అనుగుణంగా షెడ్యూల్ ఆటోమేటిక్‌గా మారుతుంది. ఫ్లోసెన్సార్లు, రెయిన్ సెన్సార్లు, విండ్ సెన్సార్లు వాడుతారు. ఈ విధానంలో వినియోగం, నీటిపారుదల, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. పచ్చదనాన్ని కాపాడడం, పొదుపు, వృథా అరికట్టేలా నీటిపారుదల వ్యవస్థ పనిచేస్తుంది. ప్రధానంగా మానవశక్తి మీద తక్కువగా ఆధారపడడమే కాకుండా, అన్ని మొక్కలకు సమానంగా నీళ్లు అందుతాయి.

ఇతర పర్యావరణ హిత చర్యలు


* ఎయిర్‌పోర్టు 100శాతం ఎల్‌ఈడీ లైట్ల వినియోగం దిశగా చర్యలు. దక్షిణ భారతదేశంలో మొదటిది కాగా, దేశంలో రెండోది. సోలార్ ఎనర్జీ 10 మెగావాట్లకు పెంపు.
* కర్బన ఉద్గారాలను తగ్గించడంపై ప్రత్యేక విధానం.
* దేశంలో మొట్టమొదటి ఆన్‌లైన్ ఎన్విరాన్‌మెంట్ మానిటరింగ్ స్టేషన్.

నీటి పొదుపునకు చర్యలు


* సుస్థిరమైన నీటి నిర్వహణ, సరఫరా ఉంది. సక్రమంగా, పొదుపుగా వాడేందుకు వాటర్‌ఫ్లో మీటర్లు ఉన్నాయి. వ్యర్థ జలాల శుద్ధికి ట్రీట్‌మెంట్ ప్లాంట్, వాటిని నిల్వలకు తగిన డ్రైనేజీ వ్యవస్థ, ట్యాంకులు ఉన్నాయి.
* భూగర్భ జలాలను ఎప్పటికప్పుడు కొలుస్తారు. భూమిలోపల లీకేజీలను గుర్తించేందుకు ఆల్ట్రా సోనిక్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. డ్రిప్ వినియోగంతో ఆదా చేస్తారు.
* నీటి సమృద్ధికి నీటిశుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
* వర్షపునీటి వినియోగం కోసం ఎయిర్‌పోర్టులోని ఆఫ్రాన్, ట్యాక్సివేలు, రన్‌వేలు, బిల్డింగ్‌పై భాగం, అప్రోచ్ రోడ్లు, సర్వీస్ రోడ్లు తదితర ప్రాంతాల నుంచి కాలువల ద్వారా ట్యాంకులకు తరలిస్తారు.
* ఎయిర్‌పోర్టులో ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్ నిర్మించారు. ఒక ఏడాది వాడుకోవచ్చు.
* 40 ఎకరాల విస్తీర్ణంలో రీచార్జ్ బేసిన్‌తోపాటు 10 కృత్రిమ బావులను అభివృద్ధి చేశారు. దీంతో ప్రతి ఏటా 1.729 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలు రీచార్జ్ అవుతాయి.

లభించిన పర్యావరణ పురస్కారాలు


* ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్టు రికగ్నైషన్ 2019 ప్యానెల్ జీఎంఆర్ హైదరాబాద్ నీటి వ్యవస్థకు సిల్వర్ రికగ్నైషన్ గుర్తింపు.
* వ్యర్ధాల నిర్వహణకు అంతర్జాతీయ విమానాశ్రయం 5-15 మిలియన్ ప్యాసింజర్ల విభాగంలో ప్రతిష్టాత్మక ఏసీఐ ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్సు రికగ్నైషన్ 2018 స్వర్ణం.
* గత ఏడాది ఆగస్టు 31న కాన్ఫడేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన జాతీయ అవార్డుల ఉత్సవంలో ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్ అవార్డు.

1363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles