కందకుర్తి వద్ద గోదావరికి జలకళ

Sun,July 21, 2019 09:20 PM

Water Level Increase in Kandakurthi Triveni Godavari

రెంజల్ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామ సమీపంలో గోదావరి, హరిద్ర, మంజీరా నదుల త్రివేణి సంగమ క్షేత్రంలో ఆదివారం ఉదయం నుంచే వరద ప్రవాహం పెరిగింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకల నీరు గోదావరి నదిలో వచ్చి చేరుతుండడంతో కందకుర్తి వంతెన వద్ద గోదావరి నిండుగా పారుతోంది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజుల పాటు ఆశించిన వర్షాలు లేక గోదావరి ఇసుక దిబ్బలతో ఎడారిలా తలపించింది. పరివాహక ప్రాంతంలో శని, ఆదివారాల్లో కురిసిన వర్షానికి వరద రావడంతో ప్రస్తుతం గోదావరి జలకళను సంతరించుకుంది. నదిలో గల పురాతన శివాలయాన్ని వరద ముంచెత్తింది.

1217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles