ఆకుపచ్చ తెలంగాణ చేసి చూపిస్తా : సీఎం కేసీఆర్

Sun,September 2, 2018 07:24 PM

water gives to crore acres in Telangana says CM KCR

హైదరాబాద్ : తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లిచ్చి ఆకుపచ్చ తెలంగాణను చేసి చూపిస్తాను అని సీఎం కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగిందని సీఎం చెప్పారు. పాలమూరు జిల్లాలో వలస పోయిన వారు తిరిగి వస్తున్నారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో సాగునీటి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్ చేసిన ప్రతి పని ప్రజల సొంత అనుభవంలో ఉందన్నారు. పేదల గుండె ఆవేదన తీర్చాలనే ఆలోచన నుంచి పుట్టిందే కల్యాణలక్ష్మీ అని తెలిపారు. కేజీ టూ పీజీలో భాగంగానే గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. గిరిజన, గోండు, లంబాడా గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత 3 వేల మంది గిరిజనలు సర్పంచ్‌లు అవుతారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

2232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles