ఈ-సెట్‌లో వరంగల్ విద్యార్థుల ప్రతిభ.. గౌతం, శ్రీవాణికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

Wed,May 22, 2019 10:54 PM

warangal students get first rank in telangana ecet

వరంగల్ అర్బన్: ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కోసం పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు నిర్వహించిన ఈ-సెట్ అర్హత పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఫలితాల్లో వరంగల్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీకి చెందిన విన్నకోట శ్రీవాణి కంప్యూటర్ సైన్స్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, మెకానిక్ విభాగంలో జోగం గౌతం స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఈ-సెట్‌లో సైతం వీళ్లు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థులను పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు.

638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles