నేడు వరంగల్ నిట్ వజ్రోత్సవ వేడుకలు ప్రారంభం

Mon,October 8, 2018 07:54 AM

Warangal NIT prepares for Diamond Jubilee fete

వరంగల్ : వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాలయం(నిట్) ఏర్పడి 60వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈ రోజు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిపాటు జరిగే వేడుకలను ప్రారంభించేందుకు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. ఉదయం9.30 గంటలకు వెంకయ్యనాయుడు నిట్‌కు చేరుకుని అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌లో డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా రూ.25 కోట్లతో నిర్మించనున్న అలుమిని(పూర్వవిద్యార్ధుల)కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ఆర్‌ఈసీ, నిట్‌లలో పని చేసిన ప్రిన్సిపాల్స్, డైరక్టర్లనును సన్మానించి ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో మాట్లాడుతారు. ఆడిటోరియంలో ప్రత్యక్ష ప్రసారాల కోసం పెద్ద స్క్రీన్‌ల ద్వారా విద్యార్ధులు, నిట్ ఉద్యోగులు, ఇతర అధికారులు ముఖ్యఅతిథుల ప్రసంగం చూసేలా ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల రీత్యా కార్యక్రమ వేదిక వద్దకు పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. ఉపరాష్ట్రపతి భద్రత కోసం నిట్‌లో జెడ్ కేటగిరి వ్యవస్ధను ఏర్పాటు చేశారు.

1148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles