నంద్యాల ఉప ఎన్నికలో 'వీవీపాట్' మెషిన్Wed,August 23, 2017 11:53 AM

నంద్యాల ఉప ఎన్నికలో 'వీవీపాట్' మెషిన్

కర్నూల్ : నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా.. దేశంలోనే తొలిసారిగా వీవీపాట్ మెషిన్ ను ఉపయోగిస్తుంది ఎన్నికల సంఘం. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ కు అవకాశం ఉందని.. ఆయా పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వీవీపాట్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. వీవీపాట్ మెషిన్ల ద్వారా ఓటరు తన ఓటును ఏ పార్టీకి వేశాడో తెలుసుకోవచ్చు. ఈవీఎంలో ఎవరికి ఓటేశామో తెలియజేసేలా ఒక కాగితం స్లిప్ వస్తుంది. అది ఏడు సెకండ్ల పాటు ఓటర్లకు కనిపించి, ఆ తర్వాత ఒక బాక్సులో పడిపోతుంది. అంటే ఓటర్లు తాము ఎవరికి ఓటేశామో వారికే పడిందో లేదో చూసుకోవచ్చు గానీ.. ఆ స్లిప్‌ను బయటకు తీసుకెళ్లడానికి మాత్రం కుదరదు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో వీవీపాట్ మెషిన్లు ఉపయోగించనున్నారు.

732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS