పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్లు అనుమతి లేదు: సీపీ

Wed,December 5, 2018 06:06 PM

Voters should not use mobile phones in polling booth

హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 15 మంది నోడల్ ఆఫీసర్లను నియమించారు. నగరంలో మొత్తం 3,911 పోలింగ్ స్టేషన్లు.. 60 షాడో టీంలు ఏర్పాటు చేశారు. ఎన్నికల రోజు 518 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలింగ్ బూత్‌ల్లోకి సెల్‌ఫోన్లు అనుమతి లేదని ఆయన వివరించారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో 13 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 1,368 పోలింగ్ కేంద్రాల్లో 214 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 11 చెక్‌పోస్టులు, 27 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 12వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13 నియోజకవర్గాలున్నాయి. 53వేల సీసీ కెమెరాలతో 2867 పోలింగ్ కేంద్రాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 12వేల మంది పోలీసులను మోహరించారు. 26చెక్‌పోస్టులు, 21 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు.

1960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles