కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ధి చెప్పిన ఓటర్లు

Fri,January 18, 2019 08:28 PM

voters returned the water mugs which distributed by ward member candidates in warangal dist

వరంగల్ అర్బన్: జిల్లాలోని ధర్మసాగర్ మండలంలోని దేవునూర్ గ్రామంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 6, 7 వ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తు మగ్గుకు గుర్తుగా... నిజమైన మగ్గులను ఓటర్లకు ఇచ్చి తమకే ఓటేయాలంటూ ప్రలోభపెట్టారు. అయితే.. గ్రామస్తులంతా ఏకమై.. కాంగ్రెస్ అభ్యర్థులు పంచి పెట్టిన మగ్గులను తిరిగి వారి ఇంటికే పంపి చైతన్యం చాటారు. ఓటరన్న మారాడు.. డబ్బులకు, ఇతర వస్తువులకు లొంగడు.. నీతికి, నిజాయితీకే ఓటరన్న పట్టం కడుతాడని నిరూపించారు ఆ గ్రామస్తులు.

2948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles