బస్టాండ్లు కిటకిట.. ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్న జనం

Thu,December 6, 2018 05:04 PM

voters goes to their own villages for voting

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉంటున్న జనం తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రేపు శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ఉండడంతో.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఓటర్లు.. ఎంజీబీఎస్ బస్టాండ్ లో బస్సుల కోసం వేచి చూస్తున్నారు. దీంతో ఎంజీబీఎస్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. బస్సులను పెంచాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ రాత్రి వరకు గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
3065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles