అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా: దానకిషోర్

Wed,September 26, 2018 03:26 PM

voters final list announced on October 8th says Dana kishore

హైదరాబాద్: అక్టోబర్ 8వ తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. రాజకీయ పార్టీల సమక్షంలో దానకిషోర్ నేడు ఈవీఎంలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రచార కార్యక్రమాలతో ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. కొత్తగా 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అక్టోబర్ 8న తుది జాబితా విడుదల చేస్తాం. నేటి నుంచి 20 రోజుల పాటు మొదటి విడత ఈవీఎం తనిఖీలను చేపట్టనున్నట్లు చెప్పారు. రోజూ ఈవీఎంలలో 16 నమూనా ఓట్లను వేసి పరిశీలిస్తున్నామన్నారు. ఈ నెల 28న వీవీ ప్యాడ్స్ రానున్నాయని వెల్లడించారు.

1322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles