సునీత ఓడినా..గెలిచినా ఉద్యమ బాట వీడలేదు

Tue,November 27, 2018 06:29 PM

Vote who are serves to people urges cmkcr

నల్లగొండ: ఆలేరు చాలా చైతన్యం ఉన్న ప్రాంతం. చాలా పోరాటాలు చేసిన ప్రాంతం. ప్రజాస్వామ్యంలో మంచి పరిణతి రావాలి. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజల అభీష్టం గెలవాలి. ప్రజలు ఏది కోరుకుంటరో అది జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగిస్తూ..మనకోసం పనిచేసే వాళ్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోకానీ, ఆలేరులోకానీ 58 ఏళ్లలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ కూటమి అభ్యర్థి ఒకవైపు..మరోవైపు టీఆర్‌ఎస్ అభ్యర్థి అని అన్నారు. తమకంటే ఘనాపాటిల్లేరని కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. కాంగ్రెస్ గొప్పదైతే ఇన్నాళ్లు ఎందుకు కరెంట్ ఇవ్వలేదని సీఎం ప్రశ్నించారు. మోటార్లు కాలితే పండిన పంటంతా పెట్టి రిపేర్లు చేయించాలి. గతంలో కరెంట్ ఎలా ఉండేదో..ఇపుడు ఎలా ఉందో మీకందరికీ తెలుసునన్నారు.

గతంలో ఎన్నడూలేని విధంగా వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులకు పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నమన్నారు. ఒంటరి మహిళలను ఆదుకోవాలని సునీత తనకు చాలా సార్లు చెప్పిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఒంటరి మహిళల అన్నదమ్ములు నాకు ఫోన్ చేసిన్రు. అట్లా ఒంటరి అయినందుకు మా చెల్లెను, అక్కను చూసుకోవాలని మాకుంటది. అన్నం పెట్టుకోవాలని ఉంటది. కానీ ఇంట్ల భార్యతోని పంచాయతీ ఉంటది. కాబట్టి మీ పుణ్యం వల్ల మా చెల్లెకు, అక్కకైతే మంచిగైందని..వారు నాకు చేతులెత్తి దండం పెడుతూ తృప్తిపడ్డరని సీఎం కేసీఆర్ తెలిపారు.

సునీత నాకు కూతురితో సమానం..


సునీత నాకు కూతురుతో సమానమని..ఎమ్మెల్యే తర్వాత అని సీఎం కేసీఆర్ అన్నారు. 2001లో నేను ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టిన సమయంలో చిన్న పిల్లగా నా వెంట ఉండి ఉద్యమంలో పాల్గొన్నది. మీరు దయతలిస్తే జెడ్పీటీసీగా, అన్ని హోదాల్లో పనిచేసింది. ఏ ఒక్కరోజు కూడా ఓడినా..గెలిచినా ఉద్యమ బాట వీడలేదు. చివరివరకు కేసీఆర్ వెంట ఉండి పోరాటం చేసింది. ఇలాంటి గట్టివాళ్లున్నరు కాబట్టే కేసీఆర్ విజయం సాధించాడని అన్నారు.

3042
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles