మోదీకి ఓటేయండి.. అదే మీరు మాకిచ్చే గిఫ్ట్

Tue,February 12, 2019 11:11 AM

హైదరాబాద్: పెండ్లి. అతిథులను ఆశ్చర్యపరుస్తూ.. జీవితాంతం గుర్తుండి పోయేలా వేడుకను నిర్వహిస్తారు కొందరూ. ఆడంబరాలకు పోకుండా వివాహానికి అయ్యే ఖర్చును అనాథలకు అన్నం పెట్టడం, ఇతర సమాజ సేవకు వెచ్చిస్తారు మరికొందరు. ఆహ్వాన పత్రికను వినూత్నంగా రూపొందించి సమాజ దృష్టిని ఆకర్షిస్తారు ఇంకొందరు. ఈ కోవలోకి వచ్చేదే హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడి పెండ్లి పిలుపు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓటు వేయాల్సిందిగా కోరుతూ అతడు పెండ్లి పత్రికలపై అచ్చు వేయించి అతిథులను ఆహ్వానించాడు. ముకేష్‌రావ్ వందే ప్రధాని మోదీకి వీరాభిమాని. తన పెండ్లికి వచ్చే అతిథులు కానుకలకు బదులు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీకి ఓటు వేయాల్సిందిగా కోరాడు. ఇదే మీరు మాకిచ్చే బహుమతిగా భావిస్తామని పేర్కొన్నాడు. బీజేపీ పార్టీ గుర్తు కమలాన్ని కార్డుపై గల కొటేషన్‌కు ఇరువైపులా ముద్రించాడు.


కుటుంబ సభ్యుల్లో కొంతమంది మొదట దీన్ని వ్యతిరేకించినట్లు ముకేష్ తెలిపాడు. అయినా ప్రధాని పనితీరు పట్ల తన ప్రేమను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నట్లు చెప్పాడు. రాష్ర్టానికి వచ్చేసరికి ముకేష్ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీ వీరాభిమాని. ఈ నెల 21వ తేదీన ఇతడి వివాహం. గత నెలలో గుజరాత్‌లో ఓ జంట ఇదే విధమైన విజ్ఞప్తితో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించింది. ప్రధాని దీవెనలు సైతం ఈ జంటకు అందాయి. హర్యానాలో కూడా ఓ జంట ఇదే విధమైన తీరుతో ఓట్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీని వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది. అదేవిధంగా తిరువనంతపురానికి చెందిన కెమిస్ట్రీ టీచర్ రసాయన శాస్ర్తానికి చెందిన పరిభాషలో తన పెండ్లి కార్డును అచ్చు వేయించింది. ఈ పెండ్లి పత్రిక వెరైటీగా ఉండటంతో సోషల్ మీడియాలో వీపరీత చక్కర్లు కొట్టి ప్రశంసలు పొందింది. ఈ పత్రికను కాంగ్రెస్ నేత శశి థరూర్ సైతం ట్వీట్ చేశారు.

799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles