ఓటేస్తూ వీడియో రికార్డ్.. కేసు నమోదు

Wed,May 15, 2019 05:43 AM

vote casting recorded video case registered

చిలుపూర్/ దండేపల్లి : ఓటు వేసిన దృశ్యాలను వీడియో రికార్డు చేసి వైరల్ చేసిన జనగామ జిల్లా చిలుపూరుకు చెందిన వైద్య మహేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని 26వ బూత్‌లో ఓటు వేస్తున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేసి తన మిత్రులకు వాట్సాప్ ద్వారా పంపాడు. జెడ్పీటీసీ స్థానానికి చేతిగుర్తుకు ఓటు వేస్తున్న వీడియో రికార్డు వైరల్‌గా మారింది. ఎస్సై శ్రీనివాస్ పోలింగ్ కేంద్రానికి వచ్చి బ్యాలెట్ పేపర్‌పై ఉన్న సీరియల్ నంబర్ ఆధారంగా మహేశ్‌పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బెన్‌పల్లిలో ఓటు వేసి బ్యాలెట్ పత్రం ఫొటో తీసిన సందెల రవీందర్ అనే వ్యక్తిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

1487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles