విశ్వశాంతి యాగంలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు

Tue,March 5, 2019 12:51 PM

viswasanthi yagama at mellacheruvu shembu lingeswara swamy temple

మేళ్లచెర్వు : రాష్ట్రంలోనే పేరొందిన శైవక్షేత్రం మేళ్లచెర్వు స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి స్వామిదర్శనానికి భక్తులు క్యూకట్టారు. వేలమంది భక్తజనం తరలిరావడంతో సందడి నెలకొంది. వేడుకల్లో భాగంగా ఐదు రోజులపాటు నిర్వహించే జాతర ఆరంభమైంది.

మంత్రి జగదీష్‌రెడ్డి ప్రత్యేక పూజలు


మేళ్లచెర్వు శివాలయంలో ప్రారంభమైన ప్రత్యేక పూజల్లో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీసమేతంగా అభిషేక పూజలు ప్రారంభించారు. కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ వెంకటేశ్వర్లు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, పశుసంవర్థక శాఖ జేడీ వేణుమనోహర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి, అన్నెపురెడ్డి అప్పిరెడి పూజలు చేశారు. ఎంపీపీ ఝామాచోక్లానాయక్, జడ్పీటీసీ వెంకటలక్ష్మీప్రతాపరెడ్డి, సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు.

జాతర సందడి :


మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు నిర్వహించే జాతర ఆరంభమైంది. కొనుగోలు దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు సందడి చేశారు. జెయింట్ వీల్స్, రంగుల రాట్నం, ఇతర క్రీడా ప్రాంగణాల వద్ద చిన్నారులు ఆడిపాడారు. పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

విశ్వశాంతి యాగం ప్రారంభం


శివరాత్రి పర్వదిన సందర్భంగా విశ్వమానవ కల్యాణం కోసం శ్రీమాతా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మహారుద్ర యాగ సహిత శత చండీ విశ్వశాంతి మహాయాగాన్ని ప్రారంభించారు. , విశ్వశాంతి యాగంలో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. 7వేల మందికి అన్నదానం చేశారు.

నేడు జాతీయస్థాయి ఎద్దుల పందేలు..


శివరాత్రి సందర్భంగా జాతీయస్థాయి ఎద్దుల పందేలు(బండ లాగుడు)మంగళవారం ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.

761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles