సొంతూళ్లకు వెళ్తున్న ఓటర్లు.. భారీగా ట్రాఫిక్ జామ్

Wed,April 10, 2019 09:17 AM

Villagers eager to cast vote

హైదరాబాద్: తమ సొంత ఊరిలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో బస్‌స్టేషన్లు, ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. ఎల్‌బీ నగర్ చౌరస్తా, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, ఉప్పల్ రింగ్‌రోడ్ ప్రాంతాలు రద్దీగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టోల్‌ప్లాజా వద్ద సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రేపటి పోలింగ్ కోసం ఏపీ ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్తుండటంతో అంతకంతకూ వాహనాల రద్దీ పెరిగిపోతోంది. కొంతసేపు బారికేడ్లు తొలగించి టోల్ రుసుం చెల్లించకుండానే వాహనదారులు వెళ్లారు. దీంతో యజమాన్యం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు, భద్రత సిబ్బందిని మోహరించారు.

1418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles