బీహార్ గ్యాంగ్‌గా అనుమానించి.. యాచకులను బంధించిన గ్రామస్తులు

Sat,May 26, 2018 10:51 PM

Villagers captivated beggars in suryapet district after assuming them as bihar gang

సూర్యాపేట: గ్రామంలోకి బీహార్‌గ్యాంగ్ వచ్చిందంటూ జిల్లాలోని చిలుకూరు మండల దూదియతండావాసులు అలజడి సృష్టించారు. శనివారం గ్రామంలోకి భిక్షాటన చేసేందుకు వచ్చిన ఏడుగురు వ్యక్తులను బీహార్‌గ్యాంగ్‌గా భావించి గ్రామస్తులు వారిని నిర్బంధించారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా మండలవ్యాప్తంగా పాకడంతో చుట్టుపక్కల గ్రామాలవారు సైతం గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న చిలుకూరు ఎస్‌ఐ సుధీర్‌కుమార్ తన సిబ్బందితో వచ్చి యాచకుల వివరాలను ఆరా తీశారు. ఆధార్ కార్డులను పరిశిలించి వారు ఇక్కడివారేనని నిర్దారించుకొని వదిలేశారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

2599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles