టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామంటూ గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

Mon,September 10, 2018 11:50 AM

village in karimnagar district decided to vote for trs party

కరీంనగర్: కలిసికట్టుగా ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు ఈ గ్రామస్తులు. అందుకే ఇప్పుడు ఈ గ్రామస్తులు వార్తల్లోకెక్కారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. గ్రామమంతా మూకుమ్మడిగా రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటేయాలని నిర్ణయించింది. గ్రామస్తులంతా కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామంటూ గ్రామస్తులంతా ప్రతిజ్ఞ చేసి అనంతరం నినాదాలు చేశారు. జిల్లాలోని కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ శివారు రాములపల్లి గ్రామస్తులు ఇలా వినూత్నంగా టీఆర్‌ఎస్‌కు ఓటేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

5153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles