యాదాద్రిలో విద్యావాచస్పతి హోమం

Fri,August 24, 2018 10:06 PM

vidyavachaspati homam at yadagirigutta temple

యాదాద్రి భువనగిరి : శ్రీలక్ష్మీహయగ్రీవుని సన్నిధిలో జరుగుతున్న జయంతుత్సవాలలో రెండవ రోజు శుక్రవారం విద్యావాచస్పతి హోమం నిర్వహించారు. మనిషికి అర్ధం, పరమార్ధాన్ని తెలియజెప్పేది విద్య. విద్య ప్రతీ ఒక్కరికి అందడం ద్వారా లోకంలోని సకల జనులకు తామేమిటో తెలియజెప్పాలన్న సంకల్పంతో విద్యావాచస్పతి హోమం జరిపారు. విద్య వల్ల బ్రతకడం తెలుస్తుంది... బ్రతుకుతో పాటు దానిలోని పరమార్ధాన్ని కూడా తెలుపుతుందని, విద్యార్జన వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయని ప్రధానార్చకులు నల్లంతీగల్ సీతామనోహరాచార్యులు, వివరించారు. జానవంతమైన సమాజం కోసం నిర్వహించిన హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం ఉదయం 9. 30 నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు శ్రీలక్ష్మీహయగ్రీవుని జయంతి జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు నాలుకపై బీజాక్షరాలు రాయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదపాఠశాల వ్యవహర్త నల్లంతీగల్ విజయకుమారి, ఉత్తరాధికారి నల్లంతీగల్ ఫణీంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

1362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS