కార్యకర్తల కృషి వల్లనే భారీ మెజారిటీతో గెలిచా..

Mon,May 27, 2019 05:33 PM

Victory happened because of trs party workers says kotha prabhakar reddy


సంగారెడ్డి : టీఆర్ఎస్ కార్యకర్తల కృషి వల్లనే భారీ మెజారిటీతో గెలిచానని మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రెండోసారి మెదక్‌ ఎంపీగా ఎన్నికైన కొత్తప్రభాకర్ రెడ్డికి టీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు.

ఈ సభలో కొత్తప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ..నా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజల కోసం మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి మెదక్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్నారు.

2235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles