విళంభి ఉగాది పురస్కారం అందుకున్న వెంకటాచార్యులు

Tue,March 13, 2018 08:48 PM

Venkatacharya received the Vilambhana Ugadhi Award

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఉప ప్రధానార్చకులుగా పనిచేస్తున్న కాండూరి వెంకటాచార్యులుకు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి వారు విళంభినామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని అందించారు. తెలంగాణ శ్రీవైష్ణవ సంఘం హైద్రాబాద్‌లో నిర్వహించిన పురస్కార వేడుకలకు వెంకటాచార్యులు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, జీయర్‌స్వామి కరకమలములచే సన్మానం అందుకున్నారు. దేవస్థానంలో గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. పాండిత్యంలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నారు. రానున్న ఉగాది విళంభి పురస్కారం అందించడం పట్ల వెంకటాచార్యులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సేవలో భక్తులకు నిస్వార్థంతో సేవాలందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు.

1227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS