తండ్రికి తగ్గ తనయుడు హరికృష్ణ..

Thu,August 30, 2018 11:35 AM

Venkaiah Naidu Express condolence to harikrishna death

హైదరాబాద్: సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ దుర్మరణం చాలా విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హరికృష్ణ భౌతికకాయానికి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తండ్రికి తగిన తనయుడిగా హరికృష్ణ అచంచల ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఆయన నిర్భీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరించేవారన్నారు. ఏ పనైనా చిత్తశుద్ధితో చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడుతానని హరికృష్ణ గట్టిగా చెప్పారు. ఆనాటి ఛైర్మన్ అభ్యంతరం తెలిపితే నేను జోక్యం చేసుకుని తర్జుమా చేస్తానన్నా. సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక సంతరించుకున్నారు. హరికృష్ణకు ప్రజాభిమానం మెండుగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. హరికృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.

2609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles