ముక్కుసూటి మనిషి.. వేముల ప్రశాంత్ రెడ్డి

Tue,February 19, 2019 12:31 PM

Vemula Prashanth reddy take Oath as Minister

పూర్తి పేరు : వేముల ప్రశాంత్‌ రెడ్డి
పుట్టిన తేదీ : 14-03-1966
తల్లిదండ్రులు : మంజుల, సురేందర్‌ రెడ్డి
భార్య : నీరజా రెడ్డి
పిల్లలు : కుమారుడు పూజిత్‌ రెడ్డి, కుమార్తె మానవిరెడ్డి
విద్యార్హత : బీఈ సివిల్‌(బాల్కి, కర్ణాటక)
బాల్య విద్యాభ్యాసం : వేల్పూరు, కిసాన్‌ నగర్‌


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు విధేయుడిగా ఉన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం కేసీఆర్‌తో వేముల ప్రశాంత్‌ రెడ్డికి ఆత్మీయ సాన్నిహిత్యం ఉంది. వేముల ప్రశాంత్‌ రెడ్డి తండ్రి సురేందర్‌ రెడ్డి నుండే ఈ సాన్నిహిత్యం కొనసాగుతూ వస్తోంది. టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, కేసీఆర్‌తో ఉద్యమ బాటలో నడిచిన సురేందర్‌ రెడ్డికి కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉండేది. టీఆర్‌ఎస్‌ బాల్కొండ నియోజక వర్గ ఇన్‌చార్జిగా మొదలు, ఎమ్మెల్యేగా ప్రశాంత్‌ రెడ్డికి కూడా కేసీఆర్‌తో అదే సాన్నిహిత్యం ఏర్పడింది.

ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను కేసీఆర్‌ ప్రశాంత్‌ రెడ్డికి అప్పగిస్తారు. అదే నమ్మకంతో కేబినెట్‌ హోదాలో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ను చేశారు. 2015లో హరితహారాన్ని జిల్లాలో ప్రారంభించడానికి వచ్చిన కేసీఆర్‌ ప్రశాంత్‌ రెడ్డి ఇంట్లోనే బస చేశారు. కేసీఆర్‌ నిర్వహించిన శత చండీ యాగం లో ప్రశాంత్‌ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. స్వయంగా కేసీఆరే పలుమార్లు ప్రశాంత్‌ రెడ్డి తన బిడ్డలాంటి వాడని, ఆయన ఇంజినీర్‌గా తనతో పాటు నీటి పారుదల ప్రాజెక్టు మేధోమథనంలో పాల్గొంటున్నాడని కేసీఆర్‌ వేల్పూర్‌లో జరిగిన సభలో పేర్కొన్నారు.
ఉద్యమంలో తన పాత్ర నెరవేరుస్తూనే కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రశాంత్‌ రెడ్డి పలు కీలక బాధ్యతలు నెరవేర్చారు.

ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల బాగోగుల బాధ్యతలు కేసీఆర్‌ చెప్పిన మేరకు నిర్వర్తించేవారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రతి పనిలో సీఎంకు నమ్మకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. నమ్మకస్తుడిగానే కాకుండా సమర్థుడిగా ముఖ్యమంత్రిచే అభినందనలు అందుకున్నాడు. తన తండ్రి వేముల సురేందర్‌ రెడ్డిది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. సురేందర్‌ రెడ్డికి రాజకీయ నాయకుడిగానే కాకుండా రైతు నేతగా ఘనమైన నేపథ్యముంది. ఈ నేపథ్యాన్ని చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగారు ప్రశాంత్‌ రెడ్డి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల సురేందర్‌ రెడ్డి వారసుడిగా వచ్చారు. ప్రశాంత్‌ రెడ్డికి నిజాయితీపరుడైన నేతగా పేరుంది. సాదా సీదా ఆహార్యం, అలవాటు, ముక్కు సూటిగా వ్యవహరించడం ఆయనకు విలక్షణ మైన నాయకుడిగా పేరు తెచ్చాయి. కేసీఆర్‌కు విధేయతలో తనకు తానే సాటి అనేంతగా ఉన్నారు.

2658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles