సీఎంకు వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు

Mon,June 19, 2017 07:56 PM

నిజామాబాద్ : సుమారు 200 కి.మీ దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలో నీటిని తీసుకొచ్చి.. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నింపి రైతన్నలను ఆదుకునే గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు బాల్కొండ నియోజకవర్గ రైతుల పక్షాన, ప్రజల తరపున మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

గొప్ప ప్రాజెక్ట్ కి కార్యరూపం ఇచ్చి, రూ. 1065 కోట్లతో టెండర్లను పిలిచిన నేపథ్యంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల, రైతులు, టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఒక వినూత్నమైన ఆలోచనన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.1065 కోట్ల రూపాయల ఖర్చుతో ఇంకో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినంతగా ఉపయోగం కలుగుతుందన్నారు. కేవలం రూ.1065 కోట్ల తో 60 టి.ఎం.సిల నీరు రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకువచ్చి ప్రాజెక్ట్ లో నింపడం, అతి తక్కువ ఖర్చుతో ఈ పనిని సుసాధ్యం చేయడం చాలా గొప్ప నిర్ణయమన్నారు.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద పండే 9 లక్షల ఎకరాల పంటకు ఎకరానికి రూ.15000 చొప్పున తీసుకున్న ఒక పంటకు రూ.4000 కోట్ల పంట వస్తుంది. ఒక పంటకు వచ్చే ఆదాయంలో 4వ వంతు ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం సీఎం తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. ఉత్తర తెలంగాణ లో ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, జగత్యాల జిల్లాలకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ గొప్ప ఆలోచన అని అన్నారు.

1208

More News

మరిన్ని వార్తలు...