చలాన్ పెండింగ్ ఉంటే వాహనం సీజ్

Sat,May 6, 2017 07:10 AM

Vehicle Siege of challan pending

వాహనదారులు తస్మాత్ జాగ్రత్తా..పెండింగ్ చలాన్‌లు పెట్టుకుని మీరు రోడ్లపై వాహనాలను నడిపిస్తున్నా రా...ట్రాఫిక్ పోలీసులకు మీ వాహనం కనపడితే వాటిని అక్కడిక్కడే సీజ్ చేస్తారు. చలాన్‌ను చెల్లించిన తర్వాతనే వాహనాన్ని రిలీజ్ చేస్తారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చలాన్‌లు జారీ అవుతున్నా చాలామంది వాహనదారులు వాటిని నిర్లక్ష్యం చేసి పెండింగ్‌లోనే ఉంచుతున్నారు. దీంతో ఆ పెండింగ్ చలాన్‌లు లక్షల సంఖ్యకు చేరుకుంటాయి. ఇలా వాహనదారులు నిబంధనల విషయంలో, చలాన్‌ల చెల్లింపు విషయంలో క్రమశిక్షణను తప్పుతున్నారని భావించిన అధికారులు పెండింగ్ చలాన్ విషయంలో చాలా సీరీయస్‌గా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా సైబరాబాద్ ట్రాఫీక్ పోలీసులు తనిఖీల్లో పెండింగ్ చలాన్‌లు ఉంటే ఆ వాహనాన్ని స్పాట్‌లోనే సీజ్ చేస్తున్నా రు. చలాన్‌లను చెల్లిస్తే వాటిని వదులుతున్నారు. చెల్లించే వరకు వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ విధంగా కఠినంగా వ్యవహరించడం ద్వారా వాహనాదారులు పెండింగ్ చలాన్‌లను వెనువెంటనే క్లియర్ చేసుకుంటున్నారు.

అమలులో కఠినంగా ఉంటాం
పెండింగ్ చలాన్ అంటేనే నేరం.ఉల్లంఘనను నేరంగా పరిగణించబడినందుకే చలాన్‌ను విధిస్తాం. అలాంటి చలాన్‌లను పెండింగ్‌లో పెట్టి రోడ్లపై వాహనదారులు తిరగడం కూడా నేరమే. అందుకే మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం. ఒక చలాన్ పెండింగ్‌లో ఉన్నా సరే ఆ వాహనం ట్రాఫిక్ పోలీసులకు తనిఖీల్లో దొరికినప్పుడు సీజ్ చేస్తాం. చలాన్‌లను పూర్తిగా కట్టిన తర్వాతనే వాహనాన్ని రిలీజ్ చేస్తాం. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పెండింగ్ చలాన్‌లను క్లియర్ చేసుకోవాలి. సైబరాబాద్‌లో వాహనదారులకు సురక్షితమైన ప్రయాణ వాతావరణం కల్పించేందుకు నిబంధనలను అమలులో కఠినంగా ఉంటాం.
-ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ సైబరాబాద్ ట్రాఫిక్

4542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles