నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ కన్నుమూత

Mon,January 12, 2015 09:10 PM

vb rajendraprasad passes away

vb rajendraprasad passes away


హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ ఇకలేరు. తీవ్రమైన అస్వస్థతకు గురై నగరంలోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్ను మూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ప్రముఖ సినీ హీరో జగపతి బాబు రాజేంద్రప్రసాద్ కుమారుడు. రాజేంద్రప్రసాద్ కృష్ణా జిల్లా గుడివాడలో 1932 నవంబర్ 4న జన్మించారు. వి.బి.రాజేంద్రప్రసాద్ పూర్తి పేరు వీరమాచినేని బాబు రాజేంద్రప్రసాద్. బాల్యం నుంచే ఆయన ఆస్తమా వ్యాధితో బాధపడుతూ వస్తున్నారు.

రాఘవ కళాసమితి ద్వారా వి.బి.రాజేంద్రప్రసాద్ రంగస్థలంకు పరిచయమయ్యారు. నటుడిగా కావాలని సినిరంగంలో ప్రవేశించి నిర్మాతగా స్థిరపడ్డారు. జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థలను స్థాపించారు. 1960లో అన్నపూర్ణ చిత్రంతో నిర్మాతగా మారారు. 1965లో అంతస్తులు సినిమాకు జాతీయ పురస్కారం అందుకున్నారు. అక్కినేని నాగేశ్వర్‌రావుతో ఆరాధన అనే రెండో చిత్రాన్ని నిర్మించారు. తర్వాత ఆత్మబలం, ఆస్తిపరులు, అక్కాచెల్లెల్లు, దసరాబుల్లోడు, బంగారుబాబు, కిల్లర్, సింహస్వప్నం, భార్యాభర్తల బంధం, బంగారుబొమ్మలు, పిచ్చిమారాజు వంటి మంచి చిత్రాలను నిర్మించారు. నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో దైవసన్నిధానం నిర్మాణంలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించారు. అరవై, డ్బ్బై దశకాల్లో అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. 16 చిత్రాలను నిర్మించి తెలుగులో మేటి చిత్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. దసరా బుల్లోడు సినిమాతో దర్శకుడిగా మారారు. 14 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కెప్టెన్ నాగార్జున, బంగారుబాబు వంటి చిత్రాలకు రచయితగా పనిచేశారు.

1799
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS