రేపటి నుంచి యాదాద్రిలో వసంత నవరాత్రోత్సవాలు

Sat,March 17, 2018 06:27 PM

Vasantha navaratri utsavams in yadadri alayam yadagirigutta

యాదాద్రి భువనగిరి : శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీసీతారామచంద్రస్వామి వారి వసంత నవరాత్రోత్సవాలు రేపటి నుంచి వైభవంగా ప్రారంభమవుతాయి. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన ఆలయంతో పాటు శాంతమూర్తి సీతరామచంద్రస్వామి ఆలయాన్ని తొలగించిన నేపథ్యంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాలను శివాలయంలో లాంఛనంగా ప్రారంభించి, భక్తుల సౌకర్యం కోసం ప్రధాన కార్యాలయం పక్కన గల స్టేజి వద్ద 25న శ్రీసీతారామస్వామి వారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ గీత, అనువంశికధర్మకర్త భాస్కరాయణి నర్సింహామూర్తిలు తెలిపారు.

24న శనివారం రాత్రి 8.30 గంటలకు శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం, 25న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామ కల్యాణోత్సవం, 26న సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీరాముల వారి పట్టాభిషేక ఉత్సవం, 27న మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

1237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles