హైద‌రాబాద్‌లో వ‌ర‌వ‌ర‌రావు గృహ‌నిర్బంధం

Thu,August 30, 2018 07:26 AM

హైద‌రాబాద్‌: పౌర హ‌క్కుల నేత వ‌ర‌వ‌ర‌రావును హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చారు. గాంధీన‌గ‌ర్‌లోని త‌న ఇంట్లో వ‌ర‌వ‌ర‌రావును పుణె పోలీసులు వ‌దిలి వెళ్లారు. రెండు రోజుల క్రితం దేశ‌వ్యాప్తంగా అయిదుగురు పౌర హ‌క్కుల నేత‌ల‌ను.. పుణె పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ నేత‌ల‌ను కేవ‌లం గృహ‌నిర్బంధం మాత్ర‌మే చేయాల‌ని బుధ‌వారం సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆ అయిదుగురు నేత‌ల‌ను పోలీసులు గృహ‌నిర్బంధించారు.పుణెలోని విశ్రామ్‌బాగ్ పోలీస్ స్టేష‌న్ నుంచి వ‌ర‌వ‌ర‌రావును బుధ‌వారం పోలీసులు బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను రాత్రికి రాత్రే హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. సుప్రీం ఆదేశాల ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు గృహ‌నిర్బంధంలో ఉంచ‌నున్నారు. ఆగ‌స్టు 28వ తేదీన అరెస్టు జ‌రిగింది. హ‌క్కుల నేత‌లు అరుణా పెరిరా, వ‌ర్నాన్ గొంజాలెజ్‌ల‌ను కూడా త‌మ ఇండ్ల‌కు చేర్చారు పోలీసులు. మ‌హారాష్ట్ర‌లోని బీమాకోరేగావ్‌లో జ‌రిగిన అల్ల‌ర్ల కేసులో ఆ అయిదుగుర్ని అరెస్టు చేసి పుణెకు తీసుకువెళ్లారు.అరెస్టు చేసిన హక్కుల కార్యకర్తల్లో ముగ్గురిని మహారాష్ట్ర పోలీసులు బుధవారం పుణె కోర్టు ఎదుట హాజరుపరిచారు. వరవరరావు, వెర్నన్ గొంజాల్వెజ్, అరు ణ్ ఫెరీరాలను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 6వ తేదీవరకు గృహనిర్బంధానికి ఆదేశించినందున.. ఆ ముగ్గురిని వారి ఇండ్లలోనే నిర్బంధంలో ఉంచాలని జిల్లా సెషన్స్ న్యాయమూర్తి కేడీ వదానే ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు వరవరరావు, గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను వారి నివాసాలకు తరలించారు.

1969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles