జిల్లాల్లో పలు పంచాయతీలు ఏకగ్రీవ ఎన్నిక

Sun,January 13, 2019 05:14 PM

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి గ్రామ సర్పంచిగా గుమ్ముల రవీందర్ ను ఏక గ్రీవంగా ఏనుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ముజ్జిగూడెం, అప్పలనర్సింహ పురం, తిరుమలాపురం తండా, సుద్రేపల్లి పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. తిరుమలాయపురం మండలంలో సోలిపురం పంచాయతీ ఏకగ్రీవం అయింది.

మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా మండలంలో 4 పంచాయతీలైన గురజాల, ఆలంపల్లి, మురహరిదొడ్డి, ఐనాపూర్ ఏకగ్రీవం అయ్యాయి. మాగనూరు మండలంలో రెండు పంచాయతీలు ఉజ్జెల్లి, గురువావులింగంపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్ జిల్లా మామడ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం లింగాల మండలంలో 23 పంచాయతీలకుగాను 9 గ్రామపంచాయతీలు, 76 వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఏకగ్రీవం అయిన వాటిలో అప్పపూర్, పద్మన్నపల్లి,చెన్నంపల్లి, మగ్దూంపూర్, బాకారం, మల్లోనిచెరువుతాండ, కొత్తచెరువుతాండ, షూరాపూర్, శ్రీరంగాపూర్ పంచాయతీలు ఉన్నాయి. ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లి సర్పంచిగా ఇంద్రసేనారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వంగూర్ మండలం సర్వారెడ్డిపల్లి తండాలో సర్పంచుగా నేనావత్ బుజ్జి సూర్యనాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బైర్కాన్ పల్లి గ్రామసర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెంజర్ల గ్రామ సర్పంచుగా మామిడి వసుంధర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలో 13 గ్రామపంచాయతీలు..కర్జెతండా, శాపూర్, సెల్కాపురం, ఈర్ల తండా, అల్లమయిపల్లి, తిర్మలాయపల్లి, అంతాయిపల్లి, సురాయిపల్లి సహా మరిన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం వెంకట్రామపురం పంచాయతీ ఏకగ్రీవం అయింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా పంచాయతీ ఏకగ్రీవం అయింది.

4098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles