వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు

Fri,October 26, 2018 08:01 AM

Varavara rao house arrest extended another three weeks

హైదరాబాద్: విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు గృహనిర్బంధాన్ని ఉమ్మడి హైకోర్టు మూడువారాలపాటు పొడిగించింది. సుప్రీంకోర్టు ఆయనకు గృహనిర్బంధం విధిస్తూ జారీచేసిన ఆదేశాలు నేటితో ముగియనుండటంతో దీన్ని పొడిగిస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. సుప్రీంకోర్టు గడువు ముగియనుండటంతో వరవరరావును పుణెకు తరలించేందుకు మహారాష్ట్ర పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఇందుకు వీలుగా హైదరాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నేతృత్వంలోని దిగువకోర్టు ట్రాన్సిట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వరవరరావు హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యం విచారించినన్యాయస్థానం.. దిగువకోర్టు ఉత్తర్వులపై జోక్యానికి నిరాకరించింది. గృహనిర్బంధాన్ని పొడిగిస్తున్నామని, ఈ లోగా ఆయన మహారాష్ట్రలోని కోర్టులో బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles