26న శ్రీ వరసిద్ధి వినాయక వార్షికోత్సవం

Fri,May 24, 2019 08:19 AM

varasiddhi vinayaka anniversary in tandur town


వికారాబాద్ : తాండూరు పట్టణంలోని ఆదర్శ తులసీనగర్‌లో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం 9వ వార్షికోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమాన్‌, శివలింగం, నంది విగ్రహం, నాగదేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ఈ నెల 24, 25న వేదపండితుల మంత్రోచ్ఛరణాలతో నూతన విగ్రహాలను ప్రతిష్ఠాపన చేయనున్నారు. 26న ద్వజస్తంభ ప్రతిష్ట, పూర్ణాహుతి, ప్రసాద వితరణ, భజ న కార్యక్రమం, సభా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రకాంతాచారి, కార్యదర్శి పి.జగన్నాథ్‌రెడ్డి తెలిపారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమానికి పట్టణంతో పాటు పరిసర గ్రామా ల ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి విఘ్నేషుని కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యు లు పేర్కొన్నారు.

685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles