గాంధీలో మరమ్మతులకు నోచుకోని విలువైన వైద్య పరికరాలు

Tue,February 12, 2019 06:47 AM

సికింద్రాబాద్: కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం వల్ల వైద్యుల సేవలకు ప్రతిఫలం దక్కడం లేదు. గాంధీ దవాఖాన అనునిత్యం రోగులతో కిటకిటలాడుతుంది. రాష్ట్ర నలుమూలల నుండి ఈ దవాఖానకు వస్తుంటారు. దవాఖానలో 1,050 పడకల ఆసుపత్రి సామర్ధ్యం ఉండగా అదనపు పడకలు అవసరమైతే నేలపై కూడా పరుపులు వేసి మరీ ఇక్కడి వైద్యులు తమ సేవలను అందిస్తున్నారు. 3 వేల మంది ఔట్‌పేషెంట్లుగా తమ వైద్య పరీక్షలు ప్రతిరోజూ చేయించుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ దవాఖానలలో వందల సంఖ్యలో యంత్ర పరికరాలు పని చేయడం లేదు. రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఆస్పత్రి ఉన్నతాధికారులు ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గాంధీ దవాఖానలో రోగ పరీక్షలను నిర్ధారించే యంత్ర పరికరాలకు సంబంధించిన మరమ్మతులు చేపట్టేందుకు అధికారికంగా ఫేబర్ సింధూ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. కొద్ది నెలలుగా ఈ సంస్థ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఫలితంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు.
విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదు..
దవాఖానలో 2400లకు పైగా యంత్ర పరికరాలున్నాయి. వీటిలో దాదాపు 500 పరికరాలకు మరమ్మతులు అవసరం. ఇదే విషయమై మరమ్మతులు నిర్వహించాల్సిన సంస్థకు అనేక సందర్భాల్లో నిర్వహణ పనుల విషయమై విజ్ఞప్తులు చేసినట్లు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. కీలకమైన క్యాథ్ ల్యాబ్‌లు 2, ఎంఆర్‌ఐ-1, అల్ట్రా సౌండ్ స్కానర్లు - 5, ఎండోస్కోపీలు - 6, ల్యాప్రోస్కోపీలు - 6, లిథోట్రెసీలు - 2, మానిటర్లు - 80 వరకు తక్షణ మరమ్మతులు అవసరం. పరికరాలను వినియోగంలోకి తేగలిగితే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తాము.

723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles