రవీంద్రభారతిలో వాల్మీకి జయంతి ఉత్సవాలు

Sun,October 16, 2016 02:34 PM

valmiki birth day celebrations

హైదరాబాద్: రవీంద్రభారతి వాల్మీకి జయంతి ఉత్సవాలకు వేదికైంది. ఇవాళ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన వాల్మీకి జయంతి ఉత్సవాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్నారు. పట్నం చదువులను పల్లెకు తీసుకెళ్లెలా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. 70 ఏళ్లలో ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. అందరూ విద్యావంతులు అయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యతోనే కుల, మతాల మధ్య అంతరాలు తొలగిపోతాయన్నారు.

1313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles