డబ్బు తరలిస్తూ పట్టుబడ్డ టీడీపీ నేత వల్లభనేని అనిల్

Thu,October 18, 2018 06:40 PM

Vallabhaneni Anil arrested by Taskforce police in hyderabad

హైదరాబాద్ : హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్న టీడీపీ నాయకుడు వల్లభనేని అనిల్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ నుంచి రూ. 59 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు డబ్బు తరలిస్తుండగా అనిల్‌తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి కారు, నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును ఆదాయ పన్ను శాఖకు పోలీసులు అప్పగించారు. ఎన్నికల కోసమే నగదును జగిత్యాలకు తరలిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. డబ్బు రవాణాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డబ్బు తరలిస్తున్న కారు నెంబర్ - ఏపీ 09 సీఎఫ్ 1144.

10134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles