ప్రాజెక్టుల పనులను పరిశీలించిన ఉత్తరాఖండ్ అధికారులు

Thu,February 14, 2019 08:41 PM

Uttarakhand officers visits Telangana projects sites

హైదరాబాద్ : తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్..కాళేశ్వరం, పాలమూరు లాంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల అధికారులు తెలంగాణకు వచ్చి వేగవంతంగా కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్మించిన తెహ్రీ డ్యాంకు సంబంధించిన ఉన్నతాధికారులు రాష్ట్రానికి వచ్చారు. తెహ్రీ హైడ్రో పవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ వైష్ణోయ్ నేతృత్వంలో పలువురు అధికారులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్, నార్లాపూర్ జలాశయం పనులను పరిశీలించారు. అనంతరం రాజీవ్ వైష్ణోయ్ జలసౌధలో ఇంజనీర్లతో సమావేశం అయ్యారు. తెహ్రీ డ్యాం నిర్మాణ సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, సవాళ్లను ఇంజినీర్లకు వివరించారు. ఈ సవాళ్లను అధిగమించడానికి తాము జరిపిన అధ్యయనాలను, డిజైన్ రూపకల్పనలో తీసుకున్న జాగ్రత్తలను తెలిపారు. తెహ్రీ డ్యాం డిజైన్, నిర్మాణం తదితర సాంకేతిక అంశాలపై ఇంజినీర్లతో చర్చించారు.

790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles