పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు

Thu,June 7, 2018 04:50 PM

Upper age limit raised by 3 years for various police department jobs

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. రీసెంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసు ఉద్యోగాలను తెలంగాణ స్టేట్ లేవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. అయితే.. పోలీసు ఉద్యోగాలకు మూడేండ్ల వయోపరిమితిని పెంచుతూ బోర్డ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ డిపార్ట్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ అండ్ ఎస్‌పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) పోస్టులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. నోటిఫికేషన్ ప్రకారం 88, 89, 90, 91 కేటగిరీ పోస్టులకు మూడేండ్ల వయోపరిమితిని పెంచుతూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వయోపరిమితి పెంపు ఉత్తర్వుల ప్రకారం నోటిఫికేషన్‌ను బోర్డు సవరించింది.

7151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles