ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా ఉప్పల్ : కేటీఆర్

Thu,November 22, 2018 06:17 PM

Uppal to make as IT care of Address says KTR

ఉప్పల్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఉప్పల్ నుంచి మల్లాపూర్ వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. ఉప్పల్ అభ్యర్థి భేతి సుభాష్ రెడ్డి తరపున మంత్రి కేటీఆర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ వస్తే ఆగమైతదని ఎన్నో అపోహలు సృష్టించారు. నాలుగేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించినమన్నారు. సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నం. ఉప్పల్ పారిశ్రామిక వాడలోకి ఐటీ పరిశ్రమలు వస్తయి. ఉప్పల్ నియోజకవర్గంలో రూ.2,184 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ఈ ప్రాంతం నుంచి ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందన్నారు. హైదరాబాద్ లో పటిష్టమైన శాంతి భద్రతలున్నాయి. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నరు. ప్రపంచ మేటి కంపెనీలు హైదరాబాద్ తరలివస్తున్నాయన్నారు. రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

2667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles