HomeLATEST NEWSUnprecedented situation for govt in 70 years

ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంది: రాజీవ్‌కుమార్

Published: Fri,August 23, 2019 04:55 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటులో ఇలాంటి పరిస్థితి 70 ఏళ్లలో ఎప్పుడూ లేదని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ అన్నారు. ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత మందగమనం సందర్భంగా రాజీవ్‌కుమార్ వ్యాఖ్యలకు ప్రధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంది. ఎవరూ ఎవర్నీ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం సరైన సమయంలో తగిన చర్య తీసుకుంటుంది. ఆ చర్యలు ఆర్థిక వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి బయటపడేస్తాయి. ఇప్పటికే కేంద్రం, ఆర్‌బీఐ అనేక చర్యలు తీసుకున్నాయి. ద్రవ్యలభ్యతకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో స్థిరత్వం వచ్చింది. బ్యాంకింగేతర సంస్థలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ఏడాది వరుసగా నాలుగుసార్లు రేపోరేటు తగ్గించాయి. రుణగ్రహితలకు తక్కువ వడ్డీలకు రుణాలు అందుతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల ప్రభుత్వరంగ బ్యాంకులు కొనుగోలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుందని తెలిపారు.
943
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology