గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Sat,September 22, 2018 10:43 PM

unknown person dead body at manikonda hyderabad

హైదరాబాద్ : గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. పూర్తివివరాలల్లోకి వెళితే... గండిపేట మండలం మంచిరేవుల గ్రామపరిధిలోని నిర్మాణుష ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి(30) మృతదేహం గత వారం రోజుల క్రితమే చనిపోయిన ఆనవాళ్లతో స్థానికులకు కన్పించడంతో పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టి మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా హత్యచేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో ఒంటిపై ఉన్న బట్టలు, ఎర్రటి షూస్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై అన్వేష్‌రెడ్డి తెలిపారు.

2952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles