రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

Thu,June 6, 2019 03:05 PM

unknown person commits suicide by train

చేగుంట: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వడియారం, మాసాయిపేట రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంట మండలం వడియారం రైల్వేస్టేషన్ 566/1-2మైలు రాయి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు, ఈ ఘటనలో మృతిడికి రెండు చెతులు, రెండు కాళ్లు శరీరం ముక్కలైనట్లు, మృతుడికి తెల్ల గడ్డం, తెల్ల మీసాలు, చోక్కపైన సికింద్రాబాద్ DRK టైలర్ పేరు ఉందని పోలీసులు తెలిపారు. ఎవరైన మృతిడికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నట్లయితే కామారెడ్డి రైల్వే పోలీసులను 9440700034 నంబర్‌కు సంప్రదించాలని, మృతదేహం పోస్టు మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

1356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles