రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి....

Sun,July 22, 2018 07:41 PM

Unknown man dead in train Accident at  Hyderabad

కాచిగూడ : పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ డి.విజయ్‌లాల్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తి(35) డబీర్‌పుర రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాచిగూడ రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీరామ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై బుడిద రంగు చొక్క, నలుపు రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు పేర్కొన్నారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

3117
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles