ఐక్య‌రాజ్య‌స‌మితిని ఆక‌ట్టుకున్న తెలంగాణ‌ రైతు బంధు

Sat,November 17, 2018 10:22 AM

United Nations FAO recognizes Rythu Bandhu insurance scheme

హైద‌రాబాద్ : బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌.. రైతుబంధు, రైతు బీమా ప‌థ‌కాలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడీ ప‌థ‌కాలు ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించాయి. ఐక్య‌రాజ్య‌స‌మితి ఈ రెండు ప‌థ‌కాల‌కు వినూత్న గుర్తింపు ఇచ్చింది. యూఎన్‌కు చెందిన ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేష‌న్‌.. ఈ రెండు ప‌థ‌కాల‌ను స‌క్సెస్ ప‌థ‌కాలుగా గుర్తించింది. రైతుల సంక్షేమం కోసం వ్య‌వ‌సాయ రంగంలో వ‌స్తున్న వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను గుర్తిస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితి విభాగ‌మైన ఎఫ్ఏఓ.. ఈ నెల 21వ తేదీ నుంచి రోమ్‌లో అంత‌ర్జాతీయ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ది. ఆ స‌ద‌స్సులో వివిధ దేశాల్లో విజ‌య‌వంత‌మైన 20 వినూత్న వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌ను ప్ర‌జెంట్ చేయ‌నున్నారు. ఆ ప‌థ‌కాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన రైతు బంధు, రైతు బీమా స్కీమ్‌లు కూడా ఉన్నాయి. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా విశేష ప్ర‌శంస‌లు పొందుతున్న ఈ రెండు ప‌థ‌కాల‌కు ఇప్పుడు ఐక్య‌రాజ్య‌స‌మితి గుర్తింపు ద‌క్క‌డం తెలంగాణ ప్ర‌భుత్వానికి రైతుల ప‌ట్ల ఉన్న నిబ‌ద్ధ‌త‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్న‌ది.

సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యంగా.. వినూత్న వ్య‌వ‌సాయ విధానాల‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి ప్రోత్స‌హిస్తున్న‌ది. ఈ వినూత్న విధానాల ద్వారా రైతు కుటుంబాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల‌న్న సంక‌ల్పంతో ఎఫ్ఏవో ముందుకు వెళ్తుంది. ఈ నేప‌థ్యంలోనే ఆ సంస్థ 20 ప‌థ‌కాల‌కు విశిష్ట గుర్తింపు ఇచ్చింది. ఆ స‌క్సెస్ ప‌థ‌కాల‌ను రోమ్ స‌ద‌స్సులో వివ‌రించ‌నున్నారు. దీని కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌దర్శ‌న కూడా ఏర్పాటు చేశారు. రోమ్ స‌ద‌స్సులో 20 వినూత్న వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌ను ఆయా దేశాల‌కు చెందిన నిపుణులు వివ‌రించ‌నున్నారు. ఆహార వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకురావ‌ల‌న్న ఉద్దేశంతో వినూత్న ప‌థ‌కాల‌కు ఎఫ్ఏవో చేయూత‌నిస్తున్న‌ది. పేద‌ల రైతుల‌ను ఆదుకుని, ప్ర‌పంచానికి ఆహార భ‌ద్ర‌త క‌ల్పించ‌డ‌మే ఎఫ్ఏవో ల‌క్ష్యం.

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న రైతు బంధు ప‌థ‌కంపై రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ కార్య‌ద‌ర్శి సీ. పార్థ‌సార‌ధి ప్ర‌సంగం చేయ‌నున్నారు. ఈనెల 22వ తేదీన ఆయ‌న స‌ద‌స్సులో మాట్లాడుతారు. ప‌టిష్ట‌మైన వ్య‌వ‌సాయ వినూత్న వ్య‌వ‌స్థ‌ల‌ను ఎలా నిర్మించాల‌న్న అంశంపై స‌ద‌స్సులో చ‌ర్చిస్తారు. తెలంగాణ రైతుల‌ను ఈ రెండు ప‌థ‌కాలు ఎలా ఆదుకున్నాయి, వారి క‌ష్టాల‌ను ఎలా తీర్చాయి, ప‌థ‌కం అమ‌లులో ఎదురైన అవాంత‌రాలు, ఆ ప‌థ‌కాలు ఎలా ప్ర‌పంచ దేశాల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయో పార్థ‌సార‌థి త‌న ప్ర‌సంగంలో వివ‌రించ‌నున్నారు. స‌ద‌స్సులో ప్ర‌ద‌ర్శించే 20 స‌క్సెస్ స్టోరీల‌కు ఓ ప్ర‌జెంట‌ర్ ఉంటారు. అయితే ఐక్య‌రాజ్య‌స‌మితి త‌న లిస్టులో రైతు బంధు స్కీమ్‌ను తొమ్మిద‌వ అంశంగా చేర్చింది. రైతు బంధు స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఎక‌రాకు 4 వేల చొప్పున రెండు సీజ‌న్ల‌కు రైతుల‌కు పంట పెట్టుబ‌డిగా ఆర్థిక సాయం చేస్తున్న‌ది. ఇక రైతు బీమా స్కీమ్ కింద ఎవ‌రైనా రైతు అకార‌ణంగా చ‌నిపోతే, ఆ కుటుంబానికి 5 ల‌క్ష‌ల బీమా చెల్లిస్తున్న‌ది. ఈ ప‌థ‌కాన్ని ఎల్ఐసీ ద్వారా అమ‌లు చేస్తున్నారు.

5087
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles