కవలలను చంపిన మేనమామ

Sat,June 16, 2018 06:38 AM

uncle killed twin brothers in Hyderabad

హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పరిధి సత్యనారాయణపురంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మానసిక వికలాంగులైన క‌వ‌ల పిల్ల‌ల‌ను సొంత‌ మేనమామే హతమార్చాడు. చిన్నారులను చంపి కారులో తరలిస్తుండగా ఇంటి యజమాని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సహకారంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మృతిచెందిన కవలలు సృజనరెడ్డి(12), విష్ణువర్దన్‌రెడ్డి(12)ల‌ది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ.వీరి త‌ల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి , లక్ష్మీ.

అక్క బాధ‌లు చూడ‌లేకే..
పిల్ల‌ల‌ ఆరోగ్య పరిస్థితి బాగలేక తన అక్క పడుతున్న బాధలు, ఆర్థిక సమస్యలు చూడలేక వారిని చంపేశాన‌ని మ‌ల్లిఖార్జున్‌రెడ్డి పోలీసుల‌కు తెలిపిన‌ట్లు స‌మాచారం. చైతన్యపురిలోని సత్యనారాయణపురం కాల‌నీలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్న మల్లికార్జున్ రెడ్డి (35) ఒక పథకం ప్రకారం ఈ హ‌త్య చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది.

మాన‌సిక దివ్యాంగులైన ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మిర్యాలగూడెం నుండి ఇక్కడికి తీసుకవచ్చి తన రూమ్‌మేట్‌ అయిన వెంకట్రామిరెడ్డి సహాయంతో హత్య చేశాడు. మృత‌దేహాల‌ను కారులో త‌ర‌లిస్తుండ‌గా ఇంటి య‌జ‌మాని గ‌మ‌నించి ఏమైంద‌ని ప్ర‌శ్నించాడు. పిల్ల‌ల‌కు ఆరోగ్యం బాగాలేద‌ని, ఆసుప‌త్రికి తీసుకెళ్తున్నామ‌ని మ‌ల్లిఖార్జున్‌రెడ్డి స‌మాధాన‌మిచ్చాడు. ఆయ‌న తీరుపై అనుమానం క‌లిగిన ఇంటి య‌జ‌మాని పోలీసుల‌కు స‌మాచారం అందించాడు.

పోలీసులు వ‌చ్చి చూడ‌గా చ‌నిపోయిన పిల్ల‌ల మృత‌దేహాల‌ను కారులో ఎక్కిస్తున్న‌ట్లు తేలింది. మ‌ల్లిఖార్జున్‌రెడ్డితోపాటు ఆయ‌న స్నేహితుడు, కారు డ్రైవ‌ర్‌ను పోలీసులు అరెస్టు చేసి చైత‌న్య‌పురి పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

అక్క‌కు చెప్పే చేశాడా?
హ‌త్య చేసిన విష‌యాన్ని తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, ల‌క్ష్మిలు చైత‌న్య‌పురి పోలీస్టేష‌న్‌కు వ‌చ్చారు. త‌మ పిల్ల‌ల హ‌త్య వెనుక ఎలాంటి కుట్ర‌లేద‌ని, త‌న బావ‌మ‌రిదితో ఎలాంటి గొడ‌వ‌లూ లేవ‌ని శ్రీ‌నివాస్‌రెడ్డి మీడియాముందు చెప్పారు. హ‌త్య చేసిన మ‌ల్లిఖార్జున్‌రెడ్డిపై పిల్ల‌ల త‌ల్లిదండ్రులు కేసు పెట్ట‌క పోవ‌డం గ‌మ‌న‌ర్హాం. పైగా జ‌రిగిందేదో జ‌రిగింది.. పోయిన ప్రాణాలు తిరిగిరావ‌ని, త‌న త‌మ్మున్ని వ‌దిలిపెట్టాల్సిందిగా ల‌క్ష్మి పోలీసుల‌ను కోరారు. ల‌క్ష్మి తీరును గ‌మ‌నిస్తే ఆమెకు హ‌త్య చేసే విష‌యం తెసులు అన్న అనుమానం క‌లుగుతున్న‌ది. అక్క అనుమ‌తితోనే మ‌ల్లిఖార్జున్‌రెడ్డి పిల్ల‌ల‌ను హైద‌రాబాదుకు తీసుకువ‌చ్చిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

3993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles