డిసెంబర్‌లో యూజీసీ నెట్

Tue,November 12, 2019 08:20 AM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా డిసెంబర్ రెండు నుంచి ఆరో తేదీ వరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్- జాతీయ అర్హత పరీక్ష (యూజీసీ-నెట్) జరుగనున్నది. తమ అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 10,34,869 మంది అభ్యర్థులు యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా 81 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డులు, పూర్తి వివరాల కోసం ugcnet.nta. nic.in, www.nta.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించ వచ్చని పేర్కొన్నారు.

552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles