ఐటీ విచారణకు హాజరైన ఉదయసింహ

Mon,October 1, 2018 11:12 AM

హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహ.. ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయంలో ఉదయసింహను అధికారులు విచారిస్తున్నారు. గత వారంలో రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయసింహ, కొండల్‌రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఇవాళ విచారణకు హాజరు కావాలని సెబాస్టియన్, ఉదయసింహ, కొండల్‌రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నెల 3వ తేదీన రేవంత్‌రెడ్డి కూడా ఐటీ అధికారుల ఎదుట హాజరు కావాలి. రేవంత్‌కు కూడా ఐటీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

1516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles