బస్సు బైకు ఢీకొని ఇద్దరు యువకులు మృతి



Tue,November 14, 2017 10:25 PM
బస్సు బైకు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

సంగారెడ్డి : ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ పట్టణ సమీపంలోని రాంనగర్‌కు చెందిన అరుణ్(22), రవి(25)లు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పై జాతీయ రహదారిపై వస్తుండగా రంజోల్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదన్నారు. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారని, మృతదేహాలను శవ పరీక్షలు చేసేందుకు జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించమన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాని ఆయన తెలిపాడు.

882
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS